Feeds:
Posts
Comments

Bonsai

Quirkily, with enthusiasm moribund

And the rush from the work behind

Ruminations in a husk, Shadows creep at dusk

Aside, a tiny tree on the desk

 

I pulled the sapling, a bonsai in the making;

With a pair of scissors, quivering hands crafting

There lay cluttered, the snipped roots

And the just sprouted tender green twigs and shoots.

 

The stifled thoughts of a suppressed tot!

 

I finished crimping, and debilitated,

Just when the little tree yearned to grow.

Just like they did it in the school, and scorned,

When I started longing for logic.

 

Like that little gold fish circling fluently,

In the constraints of my living room aquarium;

Like that canary tweeting mellifluously,

Behind the bars of the cage in the backyard patio;

This little bonsai, in a pot next to the door steps,

Quizzed; ensured my conscience censured.

 

Once again, in the dim lights of passing thoughts …

జాతర

పుకార్లు పుంజీలుగా పట్టేసి,

కల్పనల కల్లు మస్తుగా, మత్తుగా, తాగి

రధాలు తోస్తున్నారు జనం

గుండెల చక్రాలేసి

ఆలోచనా నల్లేరు మీద

అజ్ఞానం పల్లేర్లు మొలచినా

చులాగ్గా లాగేస్తున్నారు,

అలాగే జీవితాల నీడ్చేస్తున్నారు!

ఈ జనం ఎడ్లు.

ఈ జనం నిజంగా గొడ్లు.

వీపుకు కొక్కాలేసుకుని

కొక్కిరాయి దేవుళ్ళ రధాల్లాగుతున్నారు!

పొలిమేరల లోని పోలేరమ్మల్లారా!

ఈ ఊళ్ళన్నీ మీరే ఏలండిక.

అడుగుకో అంకాలమ్మా!

ఈ గొడ్లు నడిచేదిక మీ అడుగుళ్ళోనే.

భక్తి గడ్డి తిని బ్రతికేస్తున్నారు వీళ్ళు  -

చావడిలో కట్ట్టి కానుకలు పితుక్కోండి.

పుట్టలోని ముసలి నాగుల్లారా,

చెట్టుక్రింద బొమ్మల్లారా, దిమ్మల్లారా,

ఊరు బయల కొండ మీది బండల్లారా,

కొబ్బరి మండల్లారా, రబ్బరు తొండల్లారా,

‘మేం కాని మరెవ్వరైనా’ ల్లారా!

అర్చన చేస్తాం, ప్రార్థన చేస్తాం,

మా కోరికల తీర్చండర్రా.

జాతర చేస్తాం,

విచక్షణకు పాతర వేస్తాం, రండర్రా!

ఏ భావ రాగాలను పెదవిపై పొదుగుకొనో

పొదివి పట్టిన హృదయ గీతికల వెదజల్లుతూ

- నగరంలో కోయిల …

రణ గొణ రణ గొణ తన మన మన తన

బేధం లేని ఖేదం లోని

పదఘట్టన నాదాల్లో లయపుట్టిన వాదాల్లో

ఒంటరి బాటసారిలా

- నగరంలో కోయిల …

జాజ్ ల బూజు వదిలిస్తూ

విరజాజుల పరిమళాల ఝరితో

వీనుల విందుగా పాడ వచ్చిన

అపురూప అతిధి

- నగరంలో కోయిల.

దున్ధుభి వత్సరమా!

రణ దుంధుభి మ్రోతలే వినిపించావు.

హసన హనన కాండలో

వ్యసన స్వనన థ్యానంలో

ఉగాదిలెన్ని తరలినా,

నయనాల ఉప్పొంగు నయాగరాలె,

కవనాల నిప్పులెగయు జ్వరాలె!

ప్రపంచపు ప్రతి అంచుకూ

నీరుకన్నా జోరుగా విస్తరించె బాధల హోరు!

స్వార్థపరుల చింతనా లోగిళ్ళలో

యుద్దోన్మాధుల కౌగిళ్ళలో

ఫాక్లాండ్, పాలస్తీనా

ప్రజల పాట్లట దిక్కులన్ని పిక్కట్టిలె.

భిన్నత్వంలో ఏకత్వానికి

మొదటినుంచీ నిర్వచనం  – భారతావని.

ఒకమూల కరువు  -

వేరొకమూల వరదలు  -

వైపరీత్యాల భిన్నత్వంలో సైతం

చవిచూచెను బాధల ఏకత్వం!

కాశ్మీరం మొదలు కన్యాకుమారి కడకు

కడలి అంచుల ఒరుసుకు విస్తరించిన

భారతావనిలో ఘోషలు, ఘోషలు

నరనరాలలోన మోసులెత్తిన బాధల ఘోషలు!

అయితేనేం -

ఈ ఘోషలే రాబోయే

‘కల్కి’ తురంగ హేషలు కాగ

ప్రతి మనిషీ కదంత్రొక్కి

రుధిరం ఉప్పొంగిస్తూ ‘రుధిరోద్గారి’ కి

స్వాగతమిస్తాడంతులేని ఆత్మవిశ్వాసంతో!

కోయిల కుహూకారాలు

ప్రకృతి పులకారాలు

మదనుని శృంగారాలు

ఇవేనా ఉగాదికి సంకేతాలు ?

కార్మికుల కనలు కావేశాలు

నిర్భాగ్యుల నివురు నైరాశ్యాలు

బిచ్చగాళ్ళ చిరుగులడ్డ కచ్చడాలు

పిచ్చివాళ్ళ హృదులనుండిన శూన్యహాసాలు

నిరుద్యోగుల నిర్వేశ రహిత నిరయ నిష్ప్రుహలు

మద్యతరగతి మందభాగ్యుల వ్యధలునిండిన మందహాసాలు

రూపుమాసిన క్షణాలు – ఏనాడౌతాయి ఉగాదికి ఉత్ప్రేరకాలు ?

మోసకారుల కపటపు వచనాలు

నాయకుల కుహనా వాగ్థానాలు

యుద్ధాల ఉన్మత్త హేళలు

ఆయుధాల వికట్టాట్టహాసాలు

దునుమాడే దురపిల్లే – చైతన్య సృవంతి కాబోదా ఈ ఉగాది ?

జగతికి శాంతి, ప్రగతికి క్రాంతి

దుష్టులకు ప్రమాదము, ప్రజలకు ప్రమోదము

- కలిగించేది

కఠిన హృదయాలలో కారుణ్యము

పఠిత హృదయాలలో ప్రావీణ్యము

- ఉత్పాతించేది

సామ్యవాదపు సామర్థ్యాని

ప్రజాస్వామ్యపు ప్రయోజనాన్ని

- ఊద్భోధించేది

సమసమాజ నిర్మాణానికి సోపానము వేసేది

సర్వమానవ సౌభ్రాత్ర తత్త్వాన్ని లోకానికి చాటేది

అదేనోయ్ -
నే వేచి చూచే చైతన్యక్రాంతి, ఉగాది.

నేనాశించే నవయుగారంభానికి ప్రారంభం, ఉగాది.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ఎప్పటిలాగే యీ యుగాది కూడా ఏదో వ్రాయాలనే తపన .. వ్రాయడం మొదలెట్టగానే పాత జ్ఙాపకాలు.. నా పాత కవితల తీసి చూస్తే నాటికీ నేటికీ మార్పే లేదు! మచ్చుకి మూడు దశాబ్ధా
ల నాటి నా రెండు కవితలీరోజందజేస్తున్నాను.

http://muralisappa.wordpress.com/2011/04/03/ఉగాది-1980/

http://muralisappa.wordpress.com/2011/04/03/ఉగాది-1982/

   గిడుగుగారి కన్యాశుల్కం, చిలకమర్తిగారి ప్రహసనాలు చదివినప్పుడుకూడా అదే భావన. మరో సారి చర్చిద్దామది.

-మురళి

రోషగాడు మారి ఆటగాడొచ్చినా కులాల చేతికే మరల కళ్ళాలు

మారాలబ్బాయి ఆరాటం, చెయ్యి విడిచి ఒంటరి పోరాటం

అప్రయోజ రాజుల చెయిజారి చెయ్యిదారినే పోయె ప్రజారాజ్యం

పంచరైన సైకిల్ టైరు పంచన తెలుగుతమ్ముళ్ళ ఆత్మాభిమానం

ఐవీలతో బలిసిన ఐరావతం, అసవ్య యువత జత భాగోతం

ఓయూలో వెలసిన అస్తవ్యస్త వ్యవస్థ, నీనా వెలిసిపోయిన భవిత 

అడుగంటిన ఆచార్యుల విజ్ఞానం, అడుగడని బడుగుల వికాసం

వికసించని కమలం, వికటించిన విప్లవ గళం

మజిలీ వీడని మజ్లిస్, మొద్దుబారిన కొడవలి

న్యాయవాదుల వితండ వాదం, ఈనాడు సాక్షిల సొంతడబ్బా సోద్యం

కోస్తా కోరేదొక రాస్తా, సీమలో ఓదార్పు ఔదార్యం

తల్లితెలంగాణ రణరంగం, అపజయ అశాంతి కేతనం

శిలాభారమైన బడి సిలబస్, తగలబెట్టబడ్డ సిటీ బస్

వక్రమైన నేటి నా రాష్ట్ర రాజకీయం – వ్రయ్యలైన ప్రజల కలల కాష్ఠం!

Follow

Get every new post delivered to your Inbox.